👉 కాంగ్రెస్ ఎన్నికల ప్రచార అస్త్రం నవోదయ విద్యాలయం ?
J.SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ గ్రామీణ విద్యార్థులలో ఆశలు రేపిన నవోదయ విద్యా సంస్థ లో వారి విద్యాభ్యాస ఆశలు అడియాశలు కానున్నాయా ? అనే చర్చ మొదలైంది. అయితే ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ధర్మపురికి మంజూరైన నవోదయ విద్యాలయం మార్పు అంశం తమ పార్టీ ఎన్నికలలో ప్రధానాంశంగా ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టు చర్చ.
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నవోదయ విద్య సంస్థ కు ప్రభుత్వం ఉచితంగా 30 ఎకరాల స్థలం గుర్తించి నవోదయ విద్యాసంస్థల కమిషనర్ కు అప్పగించింది.
రాజకీయ , సాంకేతిక, నిబంధనలో ? ఏ కారణమో ? స్పష్టత లేదు, అయితే నేరెళ్లలో గ్రామంలో ఏర్పాటు కానున్న నవోదయ విద్యాసంస్థ నిజాంబాద్ ఎంపీ అరవింద్ మార్చమని సీఎం కార్యాలయంలో లేఖ ఇచ్చినట్టు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, మీడియా సమావేశంలో ప్రకటించే వరకు ఈ నవోదయ మార్పు అంశం బయటికి ప్రపంచానికి తెలియదు. .
ఈ నేపథ్యంలో నవోదయ విద్యాసంస్థ మార్చవద్దంటూ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, హుటా హుటీనా ఢిల్లీకి వెళ్లి ఎంపీ అరవింద్ ను, ఆ శాఖ కేంద్రమంత్రి ధర్మేందర్ ప్రధాన్ ను కలసి విజ్ఞప్తి చేసి వేడుకున్న విషయం తెలిసిందే.
👉 స్థానిక బిజెపి క్యాడర్ సైతం…

గత రెండు రోజుల క్రితం ధర్మపురి బిజెపి క్యాడర్ హైదరాబాద్ కు వెళ్లి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ను కలిసి నవోదయ విద్యా సంస్థ ధర్మపురి మండలం నేరెళ్ల లో కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.
అయితే ఎంపీ అరవింద్ తాను తన పార్లమెంట్ పరిధిలో జగిత్యాల జిల్లాలో నవోదయ విద్యా సంస్థ కోసం 2019, సెప్టెంబర్, డిసెంబర్, 2023 జూలై మాసంలో సంబంధిత శాఖ కేంద్ర మంత్రులకు రాసిన లేఖలు బిజెపి క్యాడర్ కు చూపించినట్టు సమాచారం. తన పార్లమెంటు పరిధిలోనే నవోదయ విద్యా సంస్థ కొనసాగుతుందని బిజెపి క్యాడర్ కు నచ్చ చెప్పినట్టు సమాచారం.
నవోదయ విద్యా సంస్థ మార్పు తో ఈ నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావంపై స్థానిక బిజెపి క్యాడర్ ఎంపీ తో ముచ్చటించినట్టు సమాచారం.
” నవోదయ విద్యాసంస్థ ఉండేది జగిత్యాల జిల్లాలోనే కదా ” అర్హత పరీక్ష రాసేది జిల్లాలోని గ్రామీణ విద్యార్థులు కదా, అనే చర్చలు వీరి మధ్య జరిగినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి తాను రాసిన లేఖలు మా పీ. ఏ మీకు పంపిస్తాడు, మీడియా సమావేశం పెట్టి వివరించండి అంటూ ఎంపీ అరవింద్ బిజెపి కేడర్ కు వివరించినట్లు తెలిసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఎలాంటి ప్రచార సరళి చేపట్టాలి ? అనే అంశంపై స్థానిక బిజెపి క్యాడర్ తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం.