నవోదయ విద్యాలయం ధర్మపురి మండలంలోనే  కొనసాగించండి !

👉 కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎంపీ అరవింద్ ను కలిసి విజ్ఞప్తి !

👉 ఢిల్లీలో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని కొనసాగించాలని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ఢిల్లీలో  కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ , నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయన్ని ధర్మపురి మండలం నేరెళ్లలో మంజూరు చేసి తరలించకుండ నెరెల్లలోనే యధావిధిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కొనసాగించాలని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తో కలసి  డిల్లీ లోని కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలసి తన నియోజకవర్గంలో నవోదయ విద్యాసంస్థ అవసరంను మంత్రికి వివరిస్తూ వినతి పత్రం ఇచ్చారు .

👉 ఈ సందర్భంగా ఢిల్లీలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…

ధర్మపురిలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లు లో భాగంగా నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల  మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని నేరేళ్ల గ్రామం వద్ద 30 ఎకరాల ప్రభుత్వ భూమిని, రోడ్డు కనెక్టివిటీని గుర్తించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేసినట్టు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

నేరెళ్లతో పాటు (18) జవహర్ నవోదయ విద్యాలయల ఏర్పాటుకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపడం జరిగిందని, NVS నోటిఫికేషన్ తేదీ 10.01.2025 ప్రకారం, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) నేరెళ్లతో సహా తెలంగాణలోని 7 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆమోదించడం  జరిగిందన్నారు.

2025 విద్యా సంవత్సరంలో పాఠశాలలో విద్య బోధన  ప్రారంభించాలనే లక్ష్యంతో జగిత్యాల జిల్లా కలెక్టర్  నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం తాత్కాలిక పాఠశాల భవనం విద్యార్థులకు వసతి జగిత్యాల జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేశారని అన్నారు.

మా అభ్యర్థనను పరిశీలించి తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని సకాలంలో అమలు చేసేలా సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించవలసిందిగా కేంద్ర మంత్రి కోరినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

మంత్రి ధర్మేందర్ ప్రధాన్ సానుకూలంగా స్పందించి  మీ విజ్ఞప్తిని పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తెలిపారు.