నేడు బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం !

👉 ఈనెల 7 నుండి ప్రారంభమై 12 రోజులపాటు జరగనున్న నారసింహుని జాతర ఉత్సవాలు !


J.SURENDER KUMAR,


స్వర్ణాసన పీఠాయ దండకారణ్య వాసినే, శ్రీమద్బీర్పురీ శాయ శ్రీనృసింహాయ మంగళం:” రాష్ట్రం లోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి సమీపస్థ, భీర్పూర్ మండల కేంద్ర సమీప శ్రీ లక్ష్మీనర సింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 7 నుండి 19 వరకు ఘనంగా జరుగనున్నాయి.


ఈ జాతర ఉత్సవాలలో లక్షలాదిమంది గ్రామీణ భక్తజనం పాల్గొని స్వామిని దర్శించుకుని మోక్కులు తీర్చుకుంటారు. ఆదిలాబాద్, నిర్మల్ మంచిర్యాల్, నిజామాబాద్ జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఇతర రాష్ట్రాల నుంచి భక్తజనం 12 రోజుల భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు.


👉 భీర్పూర్ నృసింహుని ఉత్సవ వేడుకలలో భాగంగా,


👉 ఈనెల 7 న శుక్ర వారం ఉదయం కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, పుట్టబంగారం సాయంత్రం 6గంటలకు గుట్టపైకి ఊరేగింపు నిర్వహించారు.


👉 8 న శని వారం సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణం, ఎదుర్కొల్ల కార్యక్రమం జరిగింది.


👉 9 న ఆది వారం సాయంత్రం 6గంటలకు స్వామి వారల కల్యాణం,


👉 10 న సోమ వారం సాయంత్రం 6గంటలకు అగ్ని ప్రతిష్టాపన, స్థాళిపాక హెూమము బలిహరణం,


👉 11 న మంగళ వారం ఉదయం 10కు వసంతోత్సవం, ఉదయం 11గంటలకు క్షీరసాగర మథనం,


👉 12 న బుధవారం ఉదయం 7గంటలకు చందనోత్సవం, రాత్రి 7గంటలకు తెప్పోత్సవం, డోలోత్సవం,


👉 13 న గురు వారం మద్యాహ్నం 3గంటలకు పార్వేట్ ఉత్సవం,


👉 14 న శుక్ర వారం మద్యాహ్నం 3కు వనమహోత్సవం,


👉 16 న ఆది వారం రాత్రి 7కు వేద సదస్సు,


👉 17 న సోమవారం ఉదయా త్పూర్వం 4గంటలకు దోపుకథ, మద్యాహ్నం 2గంట లకు మహా పూర్ణాహుతి, సాయం త్రం 3గంటలకు రథోత్సవం, రాత్రి 7గంటలకు నాగబలి, చక్ర తీర్ధం,


👉 18 మంగళ వారం రాత్రి 7 గంటలకు ఏకాంతోత్సవం,


👉 19 న బుధ వారం ఉదయం 10 గంటలకు ఏకాదశ కలశ స్వపన తిరు మంజనం, పవిత్రో త్సవం, ప్రధాన కార్యక్రమా లను నిర్వహిస్తున్నారు.


దేవస్థానం నిర్వహణాధికారి ఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.

👉 బీర్పూర్ నర్సింహుడి చరిత్ర..


భీర్పూర్ గ్రామ శివార్లలో పెద్దగుట్ట, చిన్న గుట్టలపై వెలసిన శ్రీలక్ష్మీనర సింహ స్వామి భక్తుల పాలిటి కరుణా కటాక్ష మూర్తిగా, దుష్ట శిక్షకుడుగా, శిష్ట రక్షకుడుగా పేరెన్నిక గన్నారు. పూర్వం అవుసుల ధర్మయ్య అనే అధ్యాప కుడు, తన కుమారు నితో విభేదించి, స్వామిని ఆశ్రయించాడని, ఆచార వ్యవహారాలు, సాంప్రదా యాలను తులనాడే తన కుమారున్ని కడతేర్చి పరువు కాపాడితే, కస్తూరి తిలకాన్ని స్వామికి దిద్దగలనని ధర్మయ్య మొక్కుకోగా, అదేవిధంగా జరగడంతో, వెంటనే మొక్కు తీర్చుకున్నాడనే కథ

ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉంది. నేరేళ్ళ గ్రామానికి చెందిన ఒక గొల్ల బాలుడు, మేకలను మేపుతూ, ఒక రోజున చిన్నగుట్ట పైకి వెళ్ళగా, బాలుని రూపంలో వచ్చిన స్వామి తన దాహం తీర్చమని అబాలుని కోరారు. మేకలన్నింటిని గుహ లోనికి తోలుకెళ్ళి, వాటి పాలతో గొల్ల బాలుడు స్వామి దాహాన్ని తీర్చాడు.


అలాగే గుట్ట దిగుతూ వెను తిరిగి చూడగా తనమంద అనూహ్యంగా పెరగడాన్నిగాంచి, అశ్చర్య చకితుడై, దానిని భగవత్కృపగా భావించి, నేరేళ్ళ సంస్థానాధీశునికి జరిగిన విషయం చెప్పాడట. అంతకు ముందు రోజు స్వామి తనకు కలలో కనిపించి, ఆలయ నిర్మాణానికి సహకరించ మనడాన్ని గుర్తెరిగి, ఆయన వెంటనే నమ్మనాచార్యులకు కబురు పంపాడు. ఆయన సహకారంతో, నమ్మనాచార్యులు అప్పటికే వెలసిన స్వామిని కనుగొని భక్తి శ్రద్ధలతో పూజించి, ఆలయ నిర్మాణం పూర్తి గావించడం జరిగింది.

అప్పటినుండి ప్రతి ఏటా స్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తు న్నట్లు చెపుతారు. దేవాలయ ఉత్సవ నిర్వహణకై ఖుతుబ్ షాహీల కాలంలో మాన్యాలు ఇవ్వ బడినాయని, అయితే ఢిల్లీ సుల్తానులు, ఖుతుబ్ షాహీలపై దండెత్తి గోల్కొండను కైవసం చేసుకున్నాక, అట్టి మాన్యాలను రద్దు పరచినట్లు చెపుతారు.

1881లో నిజాం ప్రభువులు స్వామివారల పేరున ఉన్న మాన్యాలను ఆలయ ధర్మకర్తలు, ప్రధానాచా ర్యుడైన వొద్దిపర్తి రామానుజాచార్యుల నుండి తిరిగి తీసుకున్నారని చారిత్రికా ధారాలున్నట్లు చెపుతారు. ఆ తర్వాత అర్చకులు తుంగూరు, భీర్పూరు, నర్సింహుల పల్లె తదితర గ్రామాల్లో భిక్షాటనచేసి ఉత్సవాలను నిర్వహించారు. అదేవిధంగా అర్షకోట పరగణా క్రింద గల గ్రామాల ప్రజలు స్వామివారి ఉత్సవాల నిర్వహణకు కానుక లను సమర్పిండం అనవాయితీగా మారింది.