నేడు ధర్మపురిలో బిజెపి ఆత్మీయ సమ్మేళనం !

👉 ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరు కానున్నారు !


J.SURENDER KUMAR,


ధర్మపురి పట్టణం లో సోమవారం పట్టభద్రుల బిజెపి ఆత్మీయ సమ్మేళనం స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్ ఏసి హాల్ లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్టు పట్టణ బిజెపి శాఖ అధ్యక్షుడు గాజు భాస్కర్ తెలిపారు.


ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ శాసన సభ్యులు పాయల్ శంకర్, ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమలై అంజి రెడ్డి హాజరుకానున్నారు.


కార్యకర్తలు, నాయకులు, ప్రబారీలు పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని గాజు భాస్కర్ విజ్ఞప్తి చేశారు.