👉 ఎంపీ అభ్యర్థన మేరకే నిజామాబాద్ కు నవోదయ మంజూరు !
👉 బిజెపి రాష్ట్ర నాయకుడు డి రామ్ సుధాకర్ రావు !
J.SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ పరిధి నేరెళ్ల గ్రామంలో నవోదయ విద్యా సంస్థ ఏర్పాటు ప్రయత్నాలకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అభ్యంతరం చెప్పలేదని, తన అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నవోదయ తన పార్లమెంట్ పరిధిలో ఏర్పాటుకు లేఖ ఇచ్చాడని, బిజెపి రాష్ట్ర నాయకుడు డి రామ్ సుధాకర్ రావు ప్రకటనలో పేర్కొన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న నవోదయ విద్యాసంస్థను నిజాంబాద్ ఎంపీ అరవింద్ అభ్యంతరం చెప్పాడు అనే ఆరోపణలు, విమర్శలు వాస్తవం కాదని ప్రకటనలో పేర్కొన్నారు.
ధర్మపురి పట్టణ బిజెపి అధ్యక్షుడు గాజుభాస్కర్ నాయకత్వంలో గత వారం రోజుల క్రితం స్థానిక బిజెపి నాయకులు హైదరాబాదులో ఎంపీ అరవింద్ నివాసంలో కలసి నవోదయ విద్యాసంస్థ అంశంపై చర్చించారని ప్రకటనలో పేర్కొన్నారు.


👉2019, 2021 లో రాసిన లేఖలు ( ఫైల్ ఫోటో )
ఈ సందర్భంగా ఎంపీ స్థానిక బిజెపి నాయకులతో, నేను ఎంపీ గా గెలిచిన 2019, డిసెంబర్ లో, తిరిగి 2021 జూలై మాసంలో జగిత్యాల జిల్లా కోరుట్ల లో నవోదయ విద్యాసంస్థ మంజూరు కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులకు ఇచ్చిన ఇచ్చిన లేఖలు బిజెపి నాయకులకు చూపించారు అని ప్రకటనలో వివరించారు.
ధర్మపురి గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఢిల్లీకి వచ్చి తనను కలసి నవోదయ విద్యా సంస్థ తరలించవద్దని విజ్ఞప్తి చేసి విషయం సైతం వాస్తవం అని ఎంపీ స్థానిక క్యాడర్ కు వివరించారు. అని పేర్కొన్నారు.
తన పార్లమెంటు పరిధి కోసమే గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖలు విషయాన్ని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు వివరించాను, లక్ష్మణ్ కుమార్ , నాకు మంచి మిత్రుడు, మా మధ్య ఎలాంటి రాజకీయ విభేదాలు లేవని, అరవింద్ ధర్మపురి పట్టణ కేడర్ కు వివరించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వనికి ధర్మపురి నియోజకవర్గంలో ఏదేని విద్య సంస్థ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ప్రయత్నాలు చేస్తే తనవంతుగా సంపూర్ణ సహకారం ఇస్తానని ఎంపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు వివరించిన విషయం ధర్మపురి బిజెపి క్యాడర్ కు తెలిపినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

కోరుట్ల అసెంబ్లీ బీఆర్ఎస్, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని, రాజకీయాలకతీతంగా నవోదయ తన పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు జరుగుతున్న విషయాన్ని ఎంపీ స్థానిక నాయకులకు తెలిపారు అని పేర్కొన్నారు.

పత్రిక ప్రకటనతో పాటు. గతంలో ఎంపీ నవోదయ ఏర్పాటు కోసం కేంద్ర మంత్రులకు రాసిన లేఖల జిరాక్స్ ప్రతిని, స్థానిక బిజెపి నాయకులు ఎంపీ అరవింద్ తో చర్చిస్తున్న ఫోటోలను జతపరిచారు. నవోదయ విద్యాసంస్థ ఏర్పాటును ఎంపీ అరవింద్ అభ్యంతరం తెలుపలేదని, వాస్తవాలు ఇవి అంటూ బిజెపి నాయకుడు రామ్ సుధాకర్ రావు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.