పరాజయం తప్పదని తెలిసినా.. ప్రతీకారం తీర్చుకున్నాడు !

👉 మా కా భదలా లియా..!

👉 మాజీ ముఖ్యమంత్రి కొడుకు సందీప్ దీక్షిత్ !


J.SURENDER KUMAR,


దశాబ్ద కాలం క్రితం తన తల్లి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వయస్సును గౌరవించకుండా, అవమానకరంగా వ్యాఖ్యానాలు చేసి ఓడించిన ఆప్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీ వాల్ పై తనకు పరాజయం తప్పదు అని తెలిసి కూడా మాజీ సీఎం షీలా దీక్షిత్ తనయుడు , సందీప్ దీక్షిత్ ఓట్లు చీల్చి తాను ఓటమి చెంది క్రేజీ వాల్ ను సందీప్ దీక్షిత్ ఓడించాడు.
సందీప్ దీక్షిత్ ఓటమిని ” మాకా భాదలా లియా”
అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


కేజ్రీ వాల్ రెండు సార్లు గెలిచిన న్యూ ఢిల్లీ నియోజకవర్గం ( గతంలో గోలే మార్కెట్ గా ఉండేది ) నియోజక వర్గ పునర్విభజన తరువాత న్యూ ఢిల్లీ అయింది. ఈ సారి కేజ్రీ వాల్ ఓడిపోవడం మాత్రం కాంగ్రెస్ వల్లనే అనే చర్చ జరుగుతుంది.


బీజేపీ నుండి మాజీ ముఖ్యమంత్రి తనయుడు పర్వేష్ సాహిబ్ సింగ్ పోటీ చేయగా, ఆప్ నుండి కేజ్రీ వాల్, కాంగ్రెస్ నుండి మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ పోటీ చేశారు.కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ మాత్రం కేవలం కేజ్రీ వాల్ ఓటమి కోసమే పోటీ చేశాడు తప్పితే తాను గెలవాలి అని కాదు. అనేది చర్చ.


బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ మాజీ బీజేపీ ముఖ్యమంత్రి అయిన సాహిబ్ సింగ్ వర్మ కొడుకు.
కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ ఢిల్లీ మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కొడుకు.


కేజ్రీ వాల్ 2013 లో తన తల్లి వరుసగా మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన షీలా దీక్షిత్ పట్ల హేళనగా ,ఆవిడ వయస్సును కానీ, మహిళ అని కానీ చూడకుండా క్రేజీ వాల్ వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి కాంగ్రెస్ తో పొత్తు లేకపోవడంతో సందీప్ దీక్షిత్ కేజ్రీ వాల్ ఓటమి మాత్రమే లక్ష్యంగా పోటీ చేశాడు.

👉 సందీప్ దీక్షిత్ కి వచ్చిన ఓట్లు 4,568.

👉 కేజ్రీ వాల్ ఓడిపోయింది 4,089 ఓట్ల తేడాతో


ప్రత్యర్థులని ఎగతాళి చేస్తే ఏమవుతుందో కేజ్రీ వాల్ కు దీక్షిత్ చూపించాడు అని ఢిల్లీ నగరంలో చర్చ.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కి వచ్చేది ఏదీ ఉండదు అని తెలిసే సందీప్ దీక్షిత్ కేజ్రీ వాల్ ఓటమి లక్ష్యంగా షీలా దీక్షిత్ కుమార్తె లతిక కూడా కేజ్రీ వాల్ ఓటమి లక్ష్యంగా సోదరుడితో కలిసి ప్రచారం చేసింది

నేను మోనార్క్ ని నన్నెవ్వరూ ఓడించలేరు
నన్ను ఓడించాలి అంటే ఇంకో జన్మ ఎత్తాలి అంటూ ప్రధాని మోడీ ని ఉద్దేశించి కేజ్రీ వాల్ చేసిన వీడియో ని ఇప్పుడు బీజేపీ పార్టీ వైరల్ చేస్తున్నది.