👉 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
పట్టభద్రులకు, ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన పనితీరు గూర్చి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు అని మీకు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం పనితీరు తెలుసు అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆదివారం ధర్మపురి పట్టణంలో, పేగడపెల్లి మండల కేంద్రంలో ఎండపల్లి మండలం కొత్తపల్లి లో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ శ్రేణులతో కలసి ప్రచారం చేశారు.

👉 ఈ సంధర్బంగా పట్టభద్రులతో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఉద్యోగుల సమస్యల గూర్చి వయా సంఘాలతో చర్చించిన సందర్భం లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఆలోచన గత పాలకులకు రాలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో దాదాపు 56వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందని, జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగిందని, దీని ద్వారా భవిష్యత్తులో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన ప్రతిపక్షలు సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ, బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు నిరుద్యోగులకు చేసిన అన్యాయాన్ని ప్రతి పట్టబద్రుడికి వివరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ,పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సిరియర్ నెంబరు 2 పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

👉 సీఎం సభకు తరలిరండి !
సోమవారం కరీంనగర్ లో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు భారీ సంఖ్యలో పట్టభద్రులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.