👉 మహాశివరాత్రి సందర్భంగా…
J.SURENDER KUMAR,
ఈ నెల 26 న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించే మంత్రుల పేర్లు, ఆలయాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రభుత్వ పక్షాన ప్రముఖ శివాలయాల లో పట్టు వస్త్రాలు సమర్పించనున్న క్యాబినెట్ మంత్రులు వీరే ..
👉 వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి మంత్రి పొన్నం ప్రభాకర్.
👉 శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయానికి, మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు !
👉 శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయానికి, మంత్రి దామోదర రాజ నరసింహ !
👉 శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ( రామప్ప ) మంత్రి శ్రీమతి ధనసరి సీతక్క !
👉 శ్రీ స్వయంభు సాంబు లింగేశ్వర స్వామి ఆలయానికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి !
👉 శ్రీ ఛాయ సోమేశ్వర ఆలయం పనగల్, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి !
👉 శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం. పాలకుర్తి, మంత్రి శ్రీమతి కొండా సురేఖ !

👉 మంత్రులు ఏదైన పరిస్థితులలో హాజరు కాలేకపోయిన చోట, ప్రభుత్వం నామినేట్ చేసిన సంబంధిత MLA/MLC 26-న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు అని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొనబడింది.