J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది గత రెండు రోజులుగా పోలైన ఓట్లు సంఖ్య 127. ఇందులో పురుష ఓటర్లు 101 ఉంది 26 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటాషన్ సెంటర్ లో పలువురు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సెంటర్ ను కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సోమవారం నాడు సందర్శించారు. పోలింగ్ సరళి నీ పరిశీలించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు ఎలాంటి ఆవంతరాలకు తావు లేకుండా సజావుగా ఎలక్షన్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

చివరి ఓటర్ ఓటు వినియోగించుకున్న తర్వాత నిబంధనలు ప్రకారం బ్యాలెట్ బాక్సులను మూసివేసి సీల్ చేయాలని, ప్రతి ఒక్క సిబ్బంది తన మాన్యువల్ ను ఒకటికి రెండు సార్లు పరిశీలించు కోవాలని , విధులను పక్కగా నిర్వహిస్తూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని అన్నారు.
గత రెండు రోజులు లో పోస్టల్ బాలట్ లకు గాను ,పురుషులు 101 మంది మహిళలు 26మంది . .మొత్తం గా 127 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వార ఓటు వినియోగించుకున్నారనీ కలెక్టర్ తెలిపారు