రాహుల్ గాంధీని కలిసిన ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్యం కుమార్ మంగళవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.


ధర్మపురికి మంజూరైన నవోదయ విద్యా సంస్థ తరలింపు ఆపాలని విజ్ఞప్తి చేయడానికి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఈరోజు ఢిల్లీ వెళ్లారు. నిజాంబాద్ ఎంపీ అరవింద్, కేంద్రమంత్రి ధర్మేందర్ ప్రధాన్ ను ఎమ్మెల్యే కలిశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవన్ లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ను ఎంపీ గడ్డం వంశి కృష్ణ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.