👉 నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు !
J.SURENDER KUMAR,
ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ఫోన్‌లో పరామర్శించారు.
రంగరాజన్ పై కొందరు దుండగులు దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఇలాంటి దాడులను సహించేది లేదని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
👉 రంగరాజన్ దాడి.. ఆరుగురు అరెస్టు
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ వెల్లడించారు. ‘ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించాం.
నిందితులు ఖమ్మం, నిజామాబాద్కు చెందినవారు. 2022లో వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ‘రామరాజ్యం’ను స్థాపించాడు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేశాడు. రామరాజ్యంలో చేరితే ₹ 20వేలు జీతం ఇస్తానని చెప్పాడు’ అని డీసీపీ చెప్పారు. త్వరలో ఒక సభ్యులను అరెస్ట్ చేస్తామని డిసిపి తెలిపారు.