రిసెప్షన్ వేడుకలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ!


J.SURENDER KUMAR,


కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమారుడు ప్రశాంత్ ప్రవళ్లిక రిసెప్షన్ వేడుకలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ధర్మపురి పట్టణంలోని మంగళవారం రాత్రి శ్రీ లక్ష్మినరసింహ గార్డెన్ లో రిసెప్షన్ కార్యక్రమం జరిగింది.


👉 పరామర్శ !


ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు సాదం లక్ష్మీ నారాయణ ను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.
సింగరేణిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో లక్ష్మీనారాయణ రెండు కాళ్ళు కోల్పోయిన విషయం తెలిసి మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు.