👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
కొప్పుల ఈశ్వర్ మంత్రి హోదాలో ఉండి ప్రాజెక్టుకు సంబంధించి ఫారెస్ట్ క్లియరెన్స్ తేకపోవడంతోనే ప్రాజెక్ట్ పూర్తి కాలేదని మీ హయంలో పని చేసిన అధికారులు చెప్తున్నారు అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
గొల్లపల్లి మండల కేంద్రం వైశ్య భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.
మీడియా సమావేశ ముఖ్యాంశాలు
👉🏻 14 నెలలుగా బయటికి రాకుండా ఉండి ఇప్పుడు కొత్తగా రోళ్ళవాగు దగ్గరకు వెళ్ళి రోళ్లవాగును అశ్రద్ధ చేస్తున్నారు, ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు అంటూ కొప్పుల ఈశ్వర్ మాట్లాడటం విడ్డూరం అన్నారు.
👉🏻 మేడారం రిజర్వాయర్ నుండి కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్లకు హరీష్ రావు నీటిని తీసుకెళ్తున్న,కాళేశ్వరం లింక్ 2 ద్వారా దికొండ రిజర్వాయర్ ద్వారా నీటిని తరలిస్తున్న దాని పై ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు.
👉🏻 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రి గా కొనసాగిన కొప్పుల ఈశ్వర్ కాంట్రాక్టర్ దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి, కమిషన్ రావడం ఆలస్యం అవ్వడంతో ప్రాజెక్ట్ నిర్మాణం పని ముందుకు వెళ్లకుండా చేశారు అని ఆరోపించారు.
👉🏻 రోళ్ల వాగుకు సంబందించిన SKNR ఏజెన్సీ కాంట్రాక్టు కు సంబందించిన కాంట్రాక్టర్ కొప్పుల ఈశ్వర్ బాగోతం మొత్తం మాకు చెప్పారు అని అన్నారు.
👉🏻 గోదావరిలో నీరు లేకపోతే రైతుల సాగుకు ఇబ్బంది కలగకూడదని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి ఒక టిఎంసి నీటిని గోదావరిలోకి విడుదల చేసి లిఫ్ట్ సేద్యంపై ఆధారపడిన రైతాంగాన్ని ఆదుకున్నం అన్నారు.
👉🏻 కాంగ్రెస్ పార్టీ హయంలోనే ఈ ప్రాజెక్ట్ గూర్చి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకువచ్చి రోళ్లవాగును పూర్తి చేస్తాం అన్నారు.
👉🏻 కొప్పుల ఈశ్వర్ అశ్రద్ధ వల్లనే రోళ్లవాగుకి సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు అని నువ్వు నియమించిన రోళ్లవాగు DE, EE లతోనే చెప్పిపిస్తం అన్నారు.
👉🏻 వరి ధాన్యం కొనుగోలులో మిల్లర్లు 3 నుండి 4 కిలోలు కట్టింగ్ చేస్తున్నారని పెగడపెల్లి దగ్గర రైతులు మంత్రి తో మొరపెట్టుకుంటే, మంత్రి హోదాలో ఉండి మీరు వెళ్లి మిల్లర్లతో మాట్లాడుకొండి అని రైతులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన నువ్వు ఇప్పుడు రైతుల గూర్చి మాట్లాడడం విడ్డూరం అనే ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో అన్నారు