రుణాల పేరిట కోట్లాది రూపాయలు వసూలు బాధితులకు టోపీ !

👉 పోలీసుల అదుపులో సభ్యులు ?


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా లో ఓ ముఠా , కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా కోటి రూపాయల పీఎం రుణాలు ఇప్పిస్తాం, 50 % సబ్స్సిడి,ఉంటుంది అంటూ జిల్లా లో అనేక మంది వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసి బాధితులకు టోపీ పెట్టినట్టు చర్చ.


బాధితుల వద్ద సేకరించిన డబ్బులతో పట్టణాలలో ఖరీదైన భూములు, విల్లాలు, లగ్జరీ కార్లు, బైక్ లు కోనుగోలు చేసినట్టు చర్చ నెలకొంది. కొందరు భాదితులు సబ్స్సిడి డబ్బులకు అశపడి డబ్బులు ఇచ్చి మోసపోయం అని రోదిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ముఠాలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నట్లు చర్చ.

దీనికీ తోడు పీఎం సబ్స్సిడి రుణాల పేరిట మోసగించిన తీరు పట్ల కొందరు భాదితులు వారు కొన్న విల్లాలు, భూములు విక్రయించి తమ డబ్బులు తమకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వంలో కీలక నాయకుడిని సంప్రదిస్తున్నట్టు సమాచారం.