రైతాంగం ఆందోళన చెందవద్దు యూరియా కొరత లేకుండా చూస్తాం !

👉 బోనస్ డబ్బులు త్వరగా రైతుల ఖాతాలో జమ చేస్తాం !


👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J. SURENDER KUMAR,


రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, రైతాంగం కు యూరియా కొరత లేకుండా అందుబాటులో ఉంటుందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మపురి మండలం జైన గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని గురువారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించి రైతులతో మాట్లాడారు. యూరియా కొరత ఉందని రైతులు ఎమ్మెల్యేకు వివరించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతుల సమక్షంలో
సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మరియు డైరెక్టర్, జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ధర్మపురి నియోజక వర్గంలోని 12 సహకార సంఘాలకు సరిపడ యూరియాను పంపించాలని కోరారు. ఈ రోజు రాత్రి వరకు యూరియాను పంపించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

గత ఏడాది కంటే ఈ సారి కొంత రైతులు ఎక్కువ యూరియాను వాడటం జరుగుతుందని, ఇతర పంటల వైపు కూడా రైతులు మొగ్గు చూపడంతో యూరియా వినియోగం పెరిగిందన్నారు. వడ్ల కొనుగోలు లో రైతులకు నష్టం కలిగించకుండా ధాన్యం తరుగు లేకుండా లేకుండా పూర్తి చేశామని ఎమ్మెల్యే అన్నరు.

గత పాలకులు రైతులను మిలర్లతో మాట్లాడుకోండి అని హేళన చేస్తూ మాట్లాడిన అంశాన్ని రైతులకు వివరించారు. యూరియా కొరత సమస్య ఉంది అని తెలిసిన వెంటనే సొసైటి వద్దకు వచ్చి రైతులతో సమస్య గూర్చి మాట్లాడుతున్నామని అన్నారు.

కొంతమంది రైతులకు బోనస్ డబ్బులు బకాయి ఉన్నాయని త్వరలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.