సేవలాల్ ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా ఎంఎల్ఏ లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


సేవలాల్ మహా రాజ్ ఆలయ నిర్మాణానికి నావంతు గా కృషి సహకారం అందిస్తానని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


గిరిజనుల ఆరాధ్య దైవం సేవలాల్ మహా రాజ్ జయంతి సందర్భంగా సోమవారం ధర్మపురి మండలం నక్కలపేట గ్రామంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎంఎల్ఏ లక్ష్మణ్ కుమార్ పాల్గొని సేవలాల్ మహా రాజ్ ను దర్శించుకున్నారు.
ఈ సంధర్బంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ..


గిరిజనుల ఆరాధ్య దైవం సేవలాల్ మహా రాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, సేవలాల్ కరుణ కటాక్షాలు, ఆశీర్వాదాలు మన ప్రాంత ప్రజల పైన ఎల్లవేళలా ఉండాలని ఎంఎల్ఏ లక్ష్మణ్ కుమార్ మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.