శివాలయాలలో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పూజలు !

J.SURENDER KUMAR,


మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని బుధవారం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నియోజకవర్గంలోని మండలాల్లోని పలు గ్రామాల్లోని శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

ధర్మపురి పట్టణంలోని అతి పురాతన అక్కపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, వెల్గటూరు మండలంలోని కోటిలింగాల క్షేత్రంలోని శ్రీ.కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రాతః కాలం అభిషేకాలు ప్రత్యేక పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు.


గొల్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ముక్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. పెగడపల్లి మండలంలో పలు గ్రామాల్లోని ఆలయాలలో, ధర్మారం మండలం మేడారం రచ్చపల్లి గ్రామాల్లోని శివాలయాలలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయా ఆలయాల అర్చకులు వేద పండితులు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను వేదమంత్రాలతో ఘనంగా ఆశీర్వదించి, స్వామివారి శేష వస్త్రాలు బహుకరించి తీర్థప్రసాదాలు అందించారు..

ఎమ్మెల్యే వెంట ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు ఉన్నారు