శుక్రవారం ధర్మపురికి మంత్రి శ్రీధర్ బాబు !.

👉ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారంలో..!


👉 ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి రాక !


J.SURENDER KUMAR,


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ధర్మపురికి మంత్రి శ్రీధర్ బాబు రానున్నారు. పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో ఉదయం 9 గంటలకు జరగనున్న పట్టభద్రుల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారు. పట్టభద్రులతో మంత్రి శ్రీధర్ బాబు ఇంట్యాకెట్ అవుతారు.


ముందుగా స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామిని మంత్రి దర్శించుకుంటారు. ఈ సమావేశంలో పట్టబద్రులు, నిరుద్యోగ యువత పట్ల, పారదర్శకంగా ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీలు, సంవత్సర కాలంలో 56 వేల ఉద్యోగ నియామకాలు, తదితర ప్రజాపాలన ప్రభుత్వ అంశాలు వివరించనున్నారు.

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకత్వం మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ , పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, ప్రభుత్వ విప్ లు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ , చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు పక్కా ప్రణాళికతో ప్రచారం ఉదృతం చేస్తున్నారు.


👉ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కలసికట్టుగా కాంగ్రెస్ ప్రచారం !


👉 ధర్మపురి సెగ్మెంట్లో ప్రచారంలో ముందంజ….


కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ శ్రేణులు కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మండలాల వారిగా కాంగ్రెస్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు.


మండల కేంద్రంలో ఓట్లతోపాటు గ్రామాల వారిగా పట్టభద్రుల ఓట్ల వివరాలు ఆరా తీసి ఫోన్ ద్వారా ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

ఆరేపల్లి గ్రామంలో ప్రచారం.

ధర్మపురి మండలం గోదావరితీరం చివరి ఆరేపల్లి గ్రామంలో పట్టబద్రుల ఓటర్లను కాంగ్రెస్ శ్రేణులు కలిసి ఓట్ల అభ్యర్థిస్తున్నారు.