శ్రీ రాజేశ్వర స్వామి కి పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ !

J.SURENDER KUMAR,


మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ దుబ్బ రాజా రాజేశ్వర స్వామి కళ్యాణనీకి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పించారు.


సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలో మంగళవారం శ్రీ దుబ్బ రాజ రాజేశ్వర స్వామి స్వామి వార్లకు కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యెక పూజా కార్యక్రమాలలో కలెక్టర్ పాల్గొన్నారు.


అనంతరం ఆలయ అర్చకులు వేద పండితుల కలెక్టర్ ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామి వారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని, ఆ దేవ దేవుడి ఆశీస్సులు, జిల్లా ప్రజానీకం పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని తెలిపారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా శానిటేషన్ నిరంతరం చేపట్టాలని వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు అందించాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట, డిపిఓ , మధన్ మోహన్ ,ఎమ్మార్వో ఎంపీడీవో ,సంబంధిత అధికారులు పాల్గొన్నారు