సర్వేకు మరో అవకాశం జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్!

👉 ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు.


J.SURENDER KUMAR,


తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వివిధ కారణాలవల్ల పాల్గొనని వారికోసం తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని  జగిత్యాల జిల్లా  కలెక్టర్ బి.సత్య ప్రసాద్  ప్రకటనలో పేర్కొన్నారు.
ఈనెల ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు (12 రోజుల పాటు) ఈ సర్వే కొనసాగనుందని తెలిపారు.

ఈ సర్వేలో మూడు విధాలుగా వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఇంటికి తాళం వేసి ఉండడం, వివిధ కారణాలవల్ల వివరాలు ఇవ్వని వాళ్లు మాత్రమే ఈ సర్వేను వినియోగించుకోవాలని తెలిపారు.


👉 సర్వే కోసం  జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్  040-21111111  ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పని చేయనుందని తెలిపారు .
ఇప్పటి వరకు సర్వేలో నమోదు కాని కుటుంబం తరఫున కుటుంబ పెద్ద లేదా కుటుంబంలోని ఒకరు మాత్రమే కాల్ సెంటర్‌కు కాల్ చేసి వారి వివరాలు ఇవ్వాలని కోరారు .

ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్‌తో పాటుగా పోస్టల్ పిన్ కోడ్ నెంబర్ ను తెలియజేయాలని సూచించారు.
ఆ వివరాల ద్వారా డేటా బేస్ తో సరిచూసుకొని సదరు కుటుంబం సర్వేలో పాల్గొనలేదని నిర్ధారించుకొని కాల్ సెంటర్ సిబ్బంది స్థానిక ఎన్యూమరేటర్లకు సమాచారం ఇస్తారు.
ఎన్యుమరేటర్లు కాల్ సెంటర్ వివరాల ద్వారా ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి సర్వే వివరాలు నమోదు చేస్తారని తెలిపారు .


👉 ఇంతకుముందు సర్వేలో పాల్గొనని వారు నేరుగా ప్రజా పాలన సేవ కేంద్రాల్లోనూ సంప్రదించవచ్చని,పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కార్యాలయాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంపీడీవో కార్యాలయాలలో ఈ ప్రజా పాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు . అక్కడి సిబ్బంది  వివరాలను సేకరించి సర్వేలో నమోదు చేస్తారని తెలిపారు

👉 .ఆన్లైన్లో నుండి సర్వే ఫారం డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి ఆ ఫారాన్ని నేరుగా ప్రజా పాలన సేవా కేంద్రాల్లో ఇవ్వవచ్చుని తెలిపారు.


https://seeepcsurvey.cgg.gov.in లాగిన్ ద్వారా సర్వే ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు .
పై మూడు పద్ధతుల ద్వారా ఇదివరకు వివిధ కారణాలవల్ల సర్వేలో నమోదు కాని వారు  రీ సర్వేలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్   ప్రకటన లో వెల్లడించారు.