వరదవల్లి దత్తాత్రేయుడిని దర్శించుకున్న హీరో సుడిగాలి సుదీర్ !


J.SURENDER KUMAR,


జబర్దస్త్ నటులు సినీ హీరో, సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్, గురువారం వరద వెళ్లి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
దత్తాత్రేయుడు సర్పరూపంలో, శయన ముద్రలో కొలువైన అరుదైన క్షేత్రం వరదవెల్లి. ఇది రాహు క్షేత్రంగా పిలువబడుతుంది.


వరదవెల్లి గ్రామం ‘తెలంగాణ’లోని కరీంనగర్ జిల్లాలోగల బోయినపల్లి మండలంలో కరీంనగర్ వేములవాడ రోడ్ లోని కొదురుపాక స్టేజి వద్ద ఉంటుంది.


శ్రీరాం సాగర్ వరద కాల్వ ఈ గ్రామం గుండా వెళుతుండడం వల్ల ‘వరదవెల్లి’ అని పేరు వచ్చిందని కొంత మంది గ్రామస్తుల అభిప్రాయం. అయితే గురు దత్తాత్రేయుల వారు ‘వరద హస్తములతో’ ఇక్కడ వెలియడం వల్ల ‘వరదవెల్లి’ అనే పేరొచ్చిందన్నది చారిత్రాత్మక కథనం. ప్రకృతి రమణీయ అందాలతో, ఎత్తైన కొండమీద వెలసిన ఈ క్షేత్రం చూసి తీరవలసినదే. దత్త కృప ఉంటేనే అది సాధ్యం. వర్షాకాలం ప్రారంభమైతే ఈ క్షేత్రానికి వెళ్లే త్రోవ నీళ్లతో నిండిపోతుంది
.