వర్గీకరణ చట్టసభలో ఉండడం నా అదృష్టం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


మూడు దశాబ్దాల మాదిగ జాతి ఆరాట, పోరాట ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టసభలో ( అసెంబ్లిలో ) ఆమోదం సందర్భంలో నేను సభలో ఉండడం, చర్చలో పాల్గొనడం నా అదృష్టమని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మపురి పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు


👉 నేటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలోని చట్టసభలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందలేదని, బిల్లు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి వర్గీకరణ బిల్లు చర్చలు పాల్గొనే అవకాశం కల్పించిన ధర్మపురి నియోజకవర్గ ప్రజానీకానికి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.


👉 సుప్రీం కోర్టు లో ప్రభుత్వ పక్షాన వర్గీకరణ అంశంలో వాదించడానికి దేశంలో ప్రముఖ న్యాయవాదులను నియమించిన మా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి ధన్యవాదాలు అని అన్నారు.


👉 సుప్రీంకోర్టు తీర్పు రాగానే మాజీ జస్టిస్ ఏకసభ్య సభ్య కమిటీ చైర్మన్ గా షబీబ్ ముక్తాల్ ను నియమించి ఆ నివేదికను మంత్రివర్గంలో చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం మా నాయకుడి చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు.


👉 ఏ ప్రభుత్వం బీసీ కులగణ సర్వే చేయలేదు కేవలం మా ప్రభుత్వమే చేసిందన్నారు. గత బీ ఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని అణచివేయడమే కాక ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ ను జైల్లో నిర్బంధించారని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.


👉 మా ప్రభుత్వం, నాయకుడు అన్ని వర్గాల సంక్షేమం నాయకుడని వర్గీకరణ, బిసి కులగణ సర్వే లను మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.