J.SURENDER KUMAR,
ఎస్సీ వర్గీకరణతో మాదిగ జాతికి యువతకు ఉద్యోగ, విద్య తదితర అంశాలలో సామాజిక న్యాయం జరుగుతుందని శాసనసభలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లు పై చర్చ సందర్భంగా సభలో లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, తాను కులవివక్షతతో ఎంతటి మానసిక వేదనను అనుభవించానో రానున్న తరం యువత అలాంటి వివక్షతలు, బాధలు వారికి ఉండవు అన్నారు.
అసెంబ్లీ సమావేశం అనంతరం మీడియా పాయింట్ లో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.
👉 గత 30 సంవత్సరాలుగా మాదిగలకు జరుగుతున్న అన్యాయాల పైన, MRPS చేస్తున్న పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంది.
👉 1947 నుండి 2000 వరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు మా దళితులకు 18 నుండి 20 వేల వరకు ఉద్యోగాలు వస్తే ఎస్సీ వర్గీకరణ ఏర్పడిన తర్వాత 2000 నుండి 2004 సంవత్సరం వరకు కేవలం 4 సంవత్సరాల్లో సుమారు 23,500 ఉద్యోగాలు రావడం జరిగింది.
👉 కొంత మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించి అట్టి చట్టాన్ని రద్దు చేయించడంతో అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉష మెహర కమిషన్ ను ఏర్పాటు చేయగా ఎస్సి లపైన జరుగుతున్న అన్యాయాల పైన కమిటీ రిపోర్టు ఇవ్వడం జరిగింది.
👉 2018 లో కూడా ఏఐసిసి నాయకులు ఎంపి రాహుల్ గాంధీ తెలంగాణలో దళితుల కొరకు జరిగే ఎస్సి వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రకటించారు.
👉 ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ,పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెవెళ్ళ సభలో ఎస్సి వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పడం జరిగింది.
👉 దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో వర్గీకరణపై సుప్రీం కోర్టును ఆశ్రయించి మా వాదనలు వినిపించడం జరిగింది.
👉 ఈ రోజు మాకు చాలా ఆనందకరమైన రోజు, శాసన సభలో ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను, ధర్మపురి నియోజక ప్రజల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతున్నాం.