J.SURENDER KUMAR,
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన మహా శివరాత్రి మహోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ తో పాటు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు, అధికారులు జూబ్లీహిల్స్ నివాసంలో మంగళవారం ముఖ్యమంత్రి ని కలిసి ఆ మేరకు ఆహ్వాన పత్రికను అందించారు.
ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి ఆ ప్రతినిధి బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.