J.SURENDER KUMAR,
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యాసంస్థల అధినేత, విద్యావేత్త ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కి ఓట్లు వేచి భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్టబద్రులను అభ్యర్థించారు.

ధర్మపురి పట్టణ కేంద్రంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గడప గడప కు ప్రచారం చేశారు.

ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన, సంవత్సర కాలంలో 56 వేల ఉద్యోగుల నియామకం, మూతపడిన ధర్మపురిలో సంస్కృత కళాశాల తిరిగి తెరిపించడం, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్తు, 2 లక్షల రైతు రుణమాఫీ, తదితర అంశాలను వివరించారు.

గడప గడపకు ప్రచార కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.