విద్యా సంస్థ పెట్టను ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి !

👉 ప్రత్యర్థుల దుష్ప్రచారం తిప్పి కొట్టండి !


J.SURENDER KUMAR,


పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని నాలుగు జిల్లాలలో భవిష్యత్తులో మరో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థను పెట్టే ఆలోచన, అభిప్రాయం తనకు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.


ధర్మపురి పట్టణ బ్రాహ్మణ సంఘ భవనంలో శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభ జరిగింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన సభ జరిగింది.


ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఉద్దేశించి మాట్లాడుతూ, తాను ఎమ్మెల్సీగా గెలిచి తన విద్య సంస్థలను విస్తరించుకుంటానని , గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తరహా లో యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటానని నా పై దుష్ప్రచారం చేస్తున్నారని నరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


కొంతమంది విద్యా సంస్థలు నిర్వహించేవారు ముఠాగా ఏర్పడి నాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు. నారాయణ కాలేజీలు పలు రాష్ట్రాల్లో, ముంబైలో, దుబాయిలో సైతం ఉన్నాయి. ఆ విద్యా సంస్థ అధినేత ఏపీలో గెలిచి మంత్రిగా కొనసాగుతున్నాడు. నేను కాలేజీలు పెట్టాలి అనుకుంటే ఢిల్లీలో దుబాయిలో, అవసరం అయితే అమెరికాలో కూడా పెట్టగలను అని నరేందర్ రెడ్డి అన్నారు.


తాను గెలిస్తే వారి విద్యాసంస్థలు, ఉన్న ప్రాంతంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థ ఏర్పాటు చేస్తానన్న భయం వారిలో ఏర్పడిందన్నారు. తాను పట్టభద్రుల నియోజకవర్గం జిల్లాలలో ఎలాంటి విద్యాసంస్థ ఏర్పాటు చేసే ఆలోచన కానీ భవిష్యత్తులో కానీ నేను చేయనని, ప్రస్తుతం ఉన్న జూనియర్ కళాశాలలు, దేశంలోనే ధీటుగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు తీర్చిదిద్దుతానన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న సంస్థలకే యూనివర్సిటీ ఇస్తారని. నేను స్థానికుడను జిల్లా వాసిని, అందుబాటులో ఉండేవాడిని నరేందర్ రెడ్డి అన్నారు.
నా విద్యా సంస్థలు ఎస్సీ ఎస్టీ లకు ఐదు శాతం ఉచిత ప్రవేశాలు ఉంటాయని, ఫీజులో కూడా రాయితీ నిబంధనల మేరకు ఇస్తా అన్నారు.