విద్యావేత్త ఇందారపు నర్సింగరావు సార్ ఇకలేరు !

J.SURENDER KUMAR,


ధర్మపురి పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, గణిత శాస్త్ర ఉపాధ్యాయ ఘనాపాటి, ఉమ్మడి జిల్లా మాజీ విద్యాధికారి, ఇందారపు నర్సింగరావు (96) సోమవారం రాత్రి స్వర్గస్తులయ్యారు.


ధర్మపురి క్షేత్రంలో తెలుగు సంస్కృత కళాశాల, ఉన్నత పాఠశాల,( పెద్దబడి,) పురోగతికి, జగిత్యాల పాత బస్టాండ్ లో శతాబ్దాల చరిత్ర గల ఓల్డ్ హై స్కూల్ కు నర్సింగరావు ప్రధాన ఉపాధ్యాయుడిగా కొంతకాలం విధులు నిర్వహించారు.

వృత్తి నిబద్ధతకు, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనం ఆయన జీవన విధానం, అధ్యాపక వృత్తి తో పాటు వ్యవసాయం పట్ల ఆయనకు ఏనలేని మక్కువ , గత పది సంవత్సరాల క్రితం వరకు తన వ్యవసాయ భూములలో సేద్యం తీరును, రైతులకు వివరించేవారు.

నిత్యం దాదాపు 8 కిలోమీటర్ల వరకు కాలినడకన, గొడుగు పట్టుకుని పంట పొలాల వద్దకు వెళ్లి వ్యవసాయ పనులు చేయించేవారు.


బహుముఖ ప్రజ్ఞా శాలి, వివాద రహితుడు, అపారమైన మేధావి, అందర్నీ నవ్వుతూ ప్రేమగా పలకరించే నరసింగ రావు మృతి పట్ల పలువురు సంతాపం చేశారు. మంగళవారం ఉదయం పవిత్ర గోదావరి నది తీరంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.