J.SURENDER KUMAR,
రెండున్నర దశాబ్దాలుగా ప్రతిపక్షానికే పరిమితమైన బీజేపీ శనివారం ఢిల్లీ ఫలితాలలో క్లీన్ విక్టరీ సాధించింది. అధికార పార్టీగా ఢిల్లీ రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టనున్నది.75 సంవత్సరాల క్రితమే ఢిల్లీ రాష్ట్రంగా పురుడు పోసుకుంది.
70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ 1951 నుంచి పాలనా .వివరాలు ఇలా ఉన్నాయి !
👉 ఢిల్లీ మొదట ‘పార్ట్ సి’ రాష్ట్రం!
స్వాతంత్ర్యం తర్వాత ఢిల్లీలో సెల్ఫ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని పట్టాభి సీతారామయ్య నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని అప్పటి ప్రముఖ నేతలు నెహ్రూ, పటేల్ తిరస్కరించారు. 1951లో ఢిల్లీని ‘పార్ట్-సి’ పాలిత రాష్ట్రాల్లో చేర్చారు. 50 మంది సభ్యుల అసెంబ్లీ, ఒక చీఫ్ మినిస్టర్, లెఫ్టినెంట్ గవర్నర్ తరహా పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. 1956లో ఢిల్లీని కేంద్ర పాలిత ప్రాంతంగా రీస్ట్రక్చర్ చేశారు.
👉 మెట్రోపాలిటన్ కౌన్సిల్ !
1966లో ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఏర్పాటైంది. దీంట్లో 61 మంది సభ్యులు ఉండేవారు. లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో కీలక అధికారాలు ఉండేవి. జనతా పార్టీ అధికారంలో ఉన్న1977 నుంచి 1980 వరకు మినహాయించి కౌన్సిల్‌లో పూర్తిగా కాంగ్రెస్ ఆధిపత్యమే ఉండేది.
👉 నేషనల్ క్యాపిటల్ టెరిటరీ !
ఆర్టికల్ 239AA, 239AB ద్వారా1991లో ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీగా ఏర్పాటు చేశారు. స్టేట్, ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలను చేసుకునే అధికారాన్ని కల్పించారు. పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్ విషయాలను మాత్రం మినహాయించారు. ఈ ఫ్రేమ్‌వర్క్‌ను ‘ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991’ ద్వారా అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో ఒక చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉనికిలోకి వచ్చారు.
👉 1993 నుంచి అధికారం !
1993 నుంచి ఢిల్లీ అధికారం వివిధ పార్టీల మధ్య మారుతూ వచ్చింది. 1993 నుంచి 1998 వరకు బీజేపీ పాలించింది. అప్పటి నుంచి 2013 వరకు కాంగ్రెస్ అధికారంలో కొనసాగించింది. అనంతరం ఆప్ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు పాలనను అందించింది.
👉 2016లో లెఫ్టినెంట్ గవర్నర్ కంట్రోల్‌లో ఢిల్లీ యూటీ హోదాను అక్కడి హైకోర్టు సమర్థించింది. 2018లో సుప్రీంకోర్టు చీఫ్ మినిస్టర్‌ను ఎగ్జిక్యూటివ్ హెడ్‌గా పేర్కొంటూ ఎల్జీ అధికారాలను పరిమితం చేసేలా తీర్పు వెలువరించింది.
👉 గత కొన్నేళ్ల పరిణామాలు..
2019లో కేంద్రంలో బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో ‘గవర్నమెంట్ ఆఫ్ ఎన్‌సీటీ యాక్ట్’ లో సవరణలు చేశారు. అన్ని ఎగ్జిక్యూటివ్ అంశాలపై ఎల్జీ అభిప్రాయాన్ని తప్పనిసరి చేశారు. అలాగే రోజువారీ పాలనా అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీపై పరిమితులు విధించారు.
👉 2023 మేలో సుప్రీంకోర్టు మాత్రం అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌పై ఢిల్లీ ప్రభుత్వ అధికారాన్ని సమర్థించింది. కానీ, కేంద్రం మాత్రం అధికారుల నియామకాల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌కు అథారిటీ ఇస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
👉 ప్రముఖ ఢిల్లీ ముఖ్యమంత్రులు !
చౌదరి బ్రహ్మ ప్రకాష్ ( 1952-1955 ) – ఢిల్లీ తొలి ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి, సహకార సంఘాలపై దృష్టి సారించారు.
👉 గుర్ముఖ్ నిహాల్ సింగ్ ( 1955-1956 ) మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలకు ప్రాధాన్యం ఇచ్చారు.
👉 మదన్ లాల్ ఖురానా ( 1993-1996.) – పట్టణాభివృద్ధి, మెరుగైన ప్రజా సేవలపై దృష్టి కేంద్రీకరించారు.
👉 సాహిబ్ సింగ్ వర్మ ( 1996-1998 ) – మౌలిక సదుపాయాలు, విద్యా సంస్కరణలపై దృష్టి సారించారు.
👉 సుష్మా స్వరాజ్ ( 1998 ) – జాతీయ రాజకీయాల్లో కొనసాగడానికి ముందు కొంతకాలం సేవలందించారు.
👉 షీలా దీక్షిత్ ( 1998-2013 ) – మెట్రో విస్తరణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో ఢిల్లీని ఆధునీకరించిన అత్యంత సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి.
👉 అరవింద్ కేజ్రీవాల్ ( 2013-2024 ) – విద్య, ఆరోగ్య సంరక్షణ, అవినీతి వ్యతిరేకతకు ప్రాధాన్యతనిస్తూ AAPను అధికారంలో నిలబెట్టారు.
👉 ఢిల్లీ సెక్రటేరియట్ సీజ్ !

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ఢిల్లీ సెక్రటేరియట్ సీజ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD) సచివాలయాన్ని సీల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా సచివాలయం ప్రాంగణం నుండి ఎటువంటి ఫైల్, డాక్యుమెంట్ లేదా కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను బయటకు తీసుకెళ్లకూడదని పేర్కొంది.
( న్యూస్ 18 హిందీ సౌజన్యంతో)