యువత సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


👉 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో..


J.SURENDER KUMAR,


పట్టభద్రుల , నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  మంగళవారం  ధర్మపురి మండలంలోని జైన, దొంతపూర్, అరపెల్లి గ్రామాల్లో పర్యటించి యువతను, పట్టభద్రులను కలసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి  అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా: వి.నరేందర్ రెడ్డి కి ఓట్లు వేసే గెలిపించాల్సిందిగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కోరారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి పాలకులు నిరుద్యోగ యువత గురించి పట్టించుకోలేదని,  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారు 50 వేల కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన వివరాలను ఎమ్మెల్యే యువతకు వివరించారు.  పట్టభద్రులైన యువకులు  ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.