అధికార పక్షం, ప్రతిపక్షం ధర్మపురి పండితులదే !


J.SURENDER KUMAR,


రాష్ట్రంలో అధికార పార్టీ పక్షానికి, ప్రతిపక్ష పార్టీ పక్షానికి నూతన ఉగాది పర్వదినం ఆదివారం ఆశీస్సులు అందజేసిన వేద పండితులు ధర్మపురి వేద పండితులే కావడం  విశ్వావసు నామ సంవత్సర ఉగాది విశేషం.


హైదరాబాద్ రవీంద్ర భారతిలో పంచాంగ శ్రవణం చేసిన ప్రముఖ ప్రవచకుడు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్  శాస్త్రిది ధర్మపురి క్షేత్రం. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో  పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితుడు రాజేశ్వర శర్మ ది ధర్మపురి క్షేత్రమే.

ఇద్దరు వేద పండితులు పంచాంగ శ్రవణంలో ఆయా అధికార, ప్రతిపక్ష పార్టీ అగ్ర నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు ఈ సంవత్సరం వార ఫలాల ఫలితాలు వివరించింది ఇద్దరు ఒకే క్షేత్ర వాసులు.


భవిష్యత్తులో అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.