అంబేద్కర్ విగ్రహం పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని శిక్షిస్తాం !

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని గుర్తించి చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షిస్తామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు .


జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నగునూర్ గ్రామంలో గత రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల పలుచితంగా ప్రవర్తించిన సంఘటన గూర్చి శనివారం జగిత్యాల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి ఆ గ్రామానికి వెళ్లారు.

దళిత సంఘాలు నేతలతో కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు
అనంతరం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
ఈ సంఘటన వెనుక ఎంత పెద్ద వారు ఉన్న ఉపేక్షించేది లేదని వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దళిత సంఘా నాయకులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.


నేడు ప్రతి ఒక్కరూ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు అంటే ప్రతి నాయకుడికి ఆయన కల్పించిన రిజర్వేషన్ వల్లనే మేము ఇప్పుడు ఈ స్థాయిలో కొనసాగుతున్నమంటే దానికి అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.