J.SURENDER KUMAR,
జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు. ఎన్నో అనుబంధాలు, మరెన్నో అనుభవాలు. నేను మర్చిపోలేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.

వనపర్తి జిల్లాలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వనపర్తి పట్టణానికి చేరుకున్న ముఖ్యమంత్రి పట్టణంలో మిత్రమండలి ఏర్పాటు చేసిన ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిన్ననాటి మిత్రులు, గురువులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. ఫోటోలు దిగారు.

ఉన్నత పాఠశాల నుంచి జూనియర్ కాలేజీ పూర్తయ్యే వరకు వనపర్తి పట్టణంలో విద్యను అభ్యసించిన కాలం నాటి ఎంతో మంది స్నేహితులు, విద్యా బోధన చేసిన గురువులను కలుసుకున్నారు. పాత మిత్రులు, పాఠాలు చెప్పిన ఆచార్యులను పలకరించారు.
👉తాను అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లారు !

ముందు గా సీఎంరేవంత్ రెడ్డి తాను చదువుకునే రోజుల్లో వనపర్తి లో అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి వారి ఆనందానికి అవదులు లేవు. వారితో కొద్దిసేపు ఆప్యాయంగా గడిపారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంటితో తనకున్న అనుబంధాన్ని వారితో కలిసి గుర్తుచేసుకున్నారు.