👉 మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు !
J.SURENDER KUMAR,
అందరూ బాగుండాలి అందరితో పాటు అందులో మనము ఉండాలి అని ఐటీ పరిశ్రమల శాఖ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలో BLM గార్డెన్ లో రంజాన్ పండుగ పురస్కరించుకొని ప్రభుత్వం తరఫున గురువారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
ముస్లిం పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు.
మత పెద్దలకు పండ్లను తినిపించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ప్రతిరోజు ఉపవాసం చేస్తూ అల్లాను కొలుస్తున్న మైనారిటీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనారిటీ సోదరులకు బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులను కేటాయించాం.
రాబోయే కాలంలో మైనారిటీలలో పేదలకు ఇండ్లు కనీస సౌకర్యాలను కల్పించే విధంగా ముందుకు పోతాము.
మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లా వాసులందరికీ శ్రీధర్ బాబు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ యూనియన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే , ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు