J.SURENDER KUMAR,
పేద ప్రజల కష్టాలను తన కష్టంగా భావించి వాటిని పరిష్కరించి వారి పాలిట ఆపద్బాంధవుడు గా చిరస్మరణీయ సేవలు అందించిన స్వర్గీయ మాజీ స్పీకర్ దుదిల్ల శ్రీపాదరావు అభినందనీయుడు అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 88 వ జయంతి సందర్భంగా ధర్మపురి పట్టణంలోని నంది చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని శ్రీపాద రావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు..
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్గీయ శ్రీపాద రావు జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, సర్పంచ్ స్థాయి నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి మంథని నియోజక వర్గ ప్రజల ఆశీస్సులతో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ వరకు ఎదిగిన మహోన్నతమైన వ్యక్తి శ్రీపాదరావు అని అన్నారు.
పేదవారి కష్టాలను తన కష్టంగా భావించి వాటి పరిష్కారంలో ఎప్పుడు ముందుండే వారని, ఆయన తనయుడు ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన చూపిన బాటలో నడుస్తూ రాష్ట్రానికి సేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
శ్రీపాద రావు జయంతి వేడుకలను ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరుగుతుందని, వారు చేసిన సేవలు పెద ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.