👉 బెంగళూరు విమానాశ్రయంలో 14.8 కిలోల బంగారం పట్టివేత !
👉 నటి రన్యా రావు అరెస్టు !
J.SURENDER KUMAR
ఐపీఎస్ పోలీస్ అధికారి కూతురు రన్యారావ్ బంగారం అక్రమంగా రవాణా కేసులో అరెస్టు అయింది.
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రాత్రి 14.8 కిలోల బంగారం ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత కన్నడ నటి రన్యా రావును అరెస్టు చేశారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( DRI ) ఆమెను అరెస్టు చేసిందని అధికారులు PTI వార్త కథనం. రన్యా రావును ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరిచారు, కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
👉రన్యా రావు ఎవరు ?
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ సరసన ‘మాణిక్య’ (2014) చిత్రంలో నటించిన రన్యా రావు, మరికొన్ని దక్షిణ భారత చిత్రాలలో కూడా నటించింది.
బంగారం స్మగ్లింగ్ లో ఆమె ఒంటరిగా వ్యవహరిస్తుందా ? లేదా దుబాయ్ మరియు భారతదేశం మధ్య నడుస్తున్న పెద్ద స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో భాగమా ? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నటి 15 రోజుల్లో నాలుగు సార్లు దుబాయ్‌కి ప్రయాణించిన తర్వాత వారి దృష్టికి వచ్చింది.
సోమవారం ఆమె తిరిగి వచ్చిన తర్వాత అలాంటి సంఘటనలు తరచుగా వెలుగులోకి రావడంతో ఆమెపై నిఘా పెట్టి పట్టుకున్నారు.
33 ఏళ్ల రన్యా రావు కర్ణాటకకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సవతి కూతురు . ఆయన కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా పనిచేస్తున్నారు.
👉రన్యా రావు అరెస్టుకు దారితీసిన సంఘటనలు
PTI , అధికారుల కథనం ప్రకారం, రన్యా రావు దుబాయ్ నుండి ఎమిరేట్స్ విమానంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఆమె తరచుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేయడం వల్ల ఆమెపై నిఘా పెట్టారు.
ఆమె 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కి ప్రయాణించిందని గమనించిన తర్వాత పోలీసులకు అనుమానం వచ్చింది .
కస్టమ్స్ తనిఖీలను దాటవేయడానికి ఆమె తన సంబంధాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
పిటిఐ కథనం మేరకు, ఆమె విమానం దిగిన తర్వాత, కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కుమార్తె అని చెప్పుకుని, తన ఇంటికి రక్షణ కోసం స్థానిక పోలీసు సిబ్బందిని సంప్రదించింది.
ఆమె బంగారాన్ని ధరించిన తన దుస్తులలో బంగారు కడ్డీలను దాచి అక్రమంగా రవాణా చేసిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
ఆమెకు సహాయం చేయడానికి తప్పుదారి పట్టించారా ? అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను అరెస్టు చేసిన తర్వాత, విచారణ కోసం బెంగళూరులోని హెచ్‌బిఆర్ లేఅవుట్‌లోని డిఆర్‌ఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
( హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో )