J.SURENDER KUMAR,
భగవంతుడి ముందు అందరూ సమానమే అని, తను అధికారంలో ఉన్నంతకాలం లక్ష్మీ నరసింహ స్వామి వారికి సంబంధించి పూజాది కార్యక్రమాలు సమయానుకూలంగా జరిగే విధంగా చూడాలని ఆలయ ఈవో కి సూచిస్తున్నానని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో సహకరించిన అన్నదాన దాతలు, పాత్రికేయ మిత్రులకు, మరియు వివిధ శాఖల అధికారులకు, ఆలయ అర్చకులకు, ఉద్యోగులకు పట్టణంలోని ఓల్డ్ టీటీడీ లో శుక్రవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారిని ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు, ఆలయ ఈఓతో కలిసి సన్మానించి జ్ఞాపికలను, స్వామి వారి ప్రసాదాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి సేవను మోసిన బోయలకు ₹ 25 వేల రూపాయలు, దివిటీలు పట్టిన నాయి బ్రాహ్మణులకు ₹ 5 వేల రూపాయలు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నామని, వారికి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, బ్రహ్మోత్సవాల్లో అన్ని శాఖల అధికారులు ఎంతో సమన్వయంతో పనిచేయడం జరిగిందని, ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని, తాను అసెంబ్లీలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు,స్థానిక నాయకులతో మాట్లాడుతూ సమాచారం తీసుకోవడం జరిగిందని, ఆలయ అర్చకులు, అధికారుల సలహాల మేరకు ఎన్నడూ లేని విధంగా మొదటి సారిగా స్వామి వారి కళ్యాణాన్ని దేవాలయంలో కాకుండా బయట నిర్వహించడం జరిగిందనీ, దానికి భక్తులు,ప్రజల నుండి చాలా మంచి స్పందన రావడం జరిగిందన్నారు.

గురువారం డిల్లీ లో AICC ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన డిసిసి అధ్యక్షుల సమావేశంలో నాకు మాట్లాడే అవకాశం లభించడం చాలా ఆనందకరమైన విషయమని, అది లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సుల వల్లనే ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అర్చకులు, కమిటీ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు