👉 రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ !
J.SURENDER KUMAR,
బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతూ, వారి బాగోగుల కోసం తన జీవితం అంకితం చేస్తానని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ తెలిపారు.
మంగళవారం తూప్రాన్ మండల కేంద్రంలోని దేవి గార్డెన్లో జరిగిన జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. బ్రాహ్మణులు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ పరిషత్తును ఏర్పాటు చేసి నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బ్రాహ్మణుల సంక్షేమానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. బ్రాహ్మణ పరిషత్తుకు నిధులను మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. తనపై నమ్మకం ఉంచి మూడు పర్యాయాలు తనను రాష్ట్ర అధ్యక్షునిగా సభ్యులందరికీ ఎన్నుకున్నారని ఆయన గుర్తు చేశారు..
ఆదివారం రాష్ట్ర సంఘానికి ఎన్నికలు జరుగుతాయి ఆయన వివరించారు.. మూడు పర్యాయాల పాటు తన పాలన నచ్చితే నాలుగో సారి అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ఆయన కోరారు. మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సలాక రాజేశ్వర శర్మను ఆయన సభాముఖంగా అభినందించారు.. ఈయన హాయoలో మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం రాష్ట్రంలోని ఆదర్శవంతమైన సంఘముగా పేరు తెచ్చుకుంటుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు నెమలికొండ కిరణ్ కుమార్, జిల్లా బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి కాశీనాథ్ శర్మ, ఎన్నికల ప్రధాన అధికారి సోమయాజుల రవీందర్ శర్మ, ఎన్నికల సహాయకులు డి.జి.శ్రీనివాస శర్మ, శాస్త్ర మధుశ్రీ శర్మ, తూప్రాన్ డివిజన్ అధ్యక్షుడు సలాక ఆత్రేయ శర్మ, మెదక్ అధ్యక్షుడు లింగమూర్తి శర్మ,తో పాటు జిల్లాలోని అన్ని మండలాల నుండి బ్రాహ్మణులు, మహిళా సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
👉మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా సలాక రాజేశ్వర శర్మ !

2025-2028 మూడు సంవత్సరాలకు గాను జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికలు తూప్రాన్ లో జరిగాయి.. జిల్లా అధ్యక్షుడిగా యువకుడు, అన్ని రంగాల్లో నిష్టాతుడైన సలాక రాజేశ్వర శర్మ ను( తూప్రాన్)సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అలాగే ప్రధాన కార్యదర్శిగా గిరి రాజు కాశీనాథరావు( మెదక్) ,కోశాధికారిగా గౌడిచర్ల హరికృష్ణ శర్మ (నర్సాపూర్) ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా డి గిరిధర్ రావు మెదక్, బి నాగరాజు శర్మ మెదక్ ,డి మెట్రమ శర్మ, మెదక్ ,మోహన్ రావు తూప్రాన్,
సహాయ కార్య దర్శులుగా ఎస్ .ప్రవీణ్ శర్మ మెదక్ R.రమేష్ శర్మ మెదక్, కే ప్రమోద్, నర్సాపూర్.K. వేణుగోపాల్ శర్మ తూప్రాన్ ఎన్నికయ్యారు.