J. SURENDER KUMAR,
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలిపిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి స్వీట్ల పంపిణీ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
షమీం అక్తామ్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది,అలాగే గత ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలికిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనబట్ల దినేష్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, ధర్మపురి పట్టణ అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అప్పం తిరుపతి, ధర్మపురి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, రామ్దేని మొగిలి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కట్ట భువనేశ్వర్, దాసరి పురుషోత్తం, ఓజ్జల లక్ష్మణ్, గాజు సాగర్ లక్ష్మణ్ శ్రీధర్, బత్తి నరేష్, రంగ అశోక్, జంగిల్ ప్రభాకర్, పెంట మహేందర్, తదితరులు పాల్గొన్నారు