J.SURENDER KUMAR,
బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ చట్టసభలలో ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గానికి, సీఎం రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

బీసీలకురిజర్వేషన్ పెంపు, ఎస్సీ వర్గకరణను చట్ట సభల్లో ఆమోదించిన సంధర్బంగా ధర్మపురి అసెంబ్లీ పరిధి ఎండపెల్లి మండలం రాజారాంపల్లి లోని SR గార్డెన్ లో ఆదివారం నియోజకవర్గస్థాయి ఎస్సీ ఎస్టీ బీసీ కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రికి, పీసీసీ నాయకులకు, రాష్ట్ర మంత్రివర్గానికి ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభినందన సభకు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే విధంగా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం సిఎం ఇది సాహస చర్య అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని అన్నారు.
150 కుటుంబాలకు ఒక్కో అధికారి చొప్పున నియమించి సిఎం రేవంత్ రెడ్డి పక్కగా సర్వే చేయించి విమర్శలకు తావు లేకుండా చిత్తశుద్ధితో బీసీ చట్టం ఆమోదింప చేయడం అభినందనీయమన్నారు.

అభినందన సభలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పత్తిపాక X రోడ్డు వద్ద ఘనంగా స్వాగతించారు. అనంతరం Xరోడ్ నుండి SR గార్డెన్స్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు