J.SURENDER KUMAR,
హైదరాబాద్ లో శనివారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ధర్మపురి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వినతి పత్రం అందించారు.
👉 సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు !

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎంపీలు కావ్య , బలరాం నాయక్ , ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి , నాయిని రాజేందర్ రెడ్డి , రేవూరి ప్రకాష్ రెడ్డి , కేఆర్ నాగరాజు , డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, ధర్మపురి MLA అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి ని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు.