సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన లంబాడ ఎమ్మెల్యేలు !

👉 లంబాడాల మాతృభాష ”గోర్‌బోలి” రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్‌లో చేర్చాలని తీర్మానించిన నేపథ్యంలో..


J.SURENDER KUMAR,

బంజారాలు, లంబాడాల మాతృభాష “గోర్‌బోలి” ని రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం ఆమోదింపజేసినందుకు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

గిరిజన ఎమ్మెల్యేలు బాలూ నాయక్ , రాంచంద్రు నాయక్ , రాందాస్ నాయక్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి ని శాసనసభ చాంబర్‌లో కలిసి అభినందనలు తెలిపారు. లంబాడా, బంజారాల చిరకాల ఆకాంక్ష అయిన “గోర్‌బోలి” భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు   ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.