J.SURENDER KUMAR,
శాసనసభ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నీ మాజీ మంత్రులు జి రాజేశం గౌడ్, సుద్దాల దేవయ్య, నేరెళ్ల ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్, డాక్టర్ నగేష్, భద్రయ్య, చాడ వెంకట్ రెడ్డి, గుజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం కలిశారు.
మాజీ శాసనసభ్యులు మరియు మాజీ శాసనమండలి సభ్యుల సంబంధించి ఆసుపత్రికి చేరడానికి ముందు మరియు ఆసుపత్రి నుండి వెళ్ళాక సంబంధించిన బిల్లులను బీమా పథకంలో చేర్చాలని కోరారు.
ఇతర అంశాలను మరియు ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు
ఈ విషయం పట్ల సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. మరియు వీలైతే ఈ బడ్జెట్ లోపే చేరుస్తానని చెప్పడం జరిగింది.
అనంతరం బి. కి రిజర్వేషన్ బిల్లును 42% పెంచిన కారణంగా సీఎంను రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బిసి వెల్ఫేర్ మరియు ప్రధాన శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, టి.పి.సి.సి అధ్యక్షులు మహేష్ గౌడ్ ను కలసి ధన్యవాదములు తెలిపారు.