సీఎంఆర్ లబ్ధిదారులకు ₹ 74 లక్షలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గ పరిధి లోని పెగడపల్లి, గొల్లపల్లి, బుగ్గారం మండల లో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి ₹ 74 లక్షల 6వేల చెక్కులను 232 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పంపిణీ చేశారు.

👉 పెగడపల్లి మండలంలో..

పెగడపల్లి  ఎంపీడీవో కార్యాలయంలో  చేసిన సిఎంఆర్ఎఫ్  ₹ 28,88,500/- విలువ గల 88  చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

👉 గొల్లపల్లి మండల కేంద్రంలో..

గొల్లపల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ లో ₹ 32 లక్షల 31 వేల రూపాయల విలువ సీఎంఆర్ఎఫ్  చెక్కులను 105 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

👉 బుగ్గారం మండల కేంద్రంలో..

బుగ్గారం మండలంలో ₹ 12 లక్షల 87 వేల రూపాయల విలువ సీఎంఆర్ఎఫ్  చెక్కులను 39 మళ్లీ లబ్ధిదారులకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు.

ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..


గత ప్రభుత్వ పాలకులు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అప్పుల రాష్ట్రంగా మాకు అప్పగించడం జరిగిందన్నారు.  అప్పులను తీరుస్తూ  సంక్షేమ పథకాలను అమలు చేయడం తోపాట  రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని,

రైతులకు ఇప్పటికే ₹2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేయడం జరిగిందని, ఇంకా ఎవరికైనా రుణమాఫీ కానీ వారు ఉంటే వారికి రుణాలను మాఫీ చేస్తామని, ఇందిరమ్మ ఇండ్లను కూడా గ్రామ సభ నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.