J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణం నిర్వహించనున్న ప్రాంతాన్ని శుక్రవారం స్థల శుధ్ధి పుణ్యా వచన కార్యక్రమం జరిగింది.

స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నూతనంగా శ్రీమఠం స్థలములో శ్రీ స్వామివారి కళ్యాణం నిర్వహించు ప్రదేశములో స్థానిక వేదపండితులు, అర్చకుల వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా పూజాది కార్యక్రమాలు జరిగాయి.

👉 ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు ఆహ్వానం !
ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ సాంప్రదాయ పద్ధతిలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు ఆహ్వానించారు.

శుక్రవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఆహ్వనం తో పాటు స్వామివారి శేష వస్త్ర ప్రసాదం దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఎమ్మెల్యే కు అందించారు.
ఈ కార్యక్రమంలో వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసా చార్యులు , ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ పాల్గొన్నారు .
👉 బ్రహ్మోత్సవాల నిర్వహణ ప్రాంతాలు పరిశీలించిన ఎస్పి !

బ్రహ్మోత్సవాలు (జాతర) నిర్వహించు ప్రాంతాలను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. దేవస్థానం లోపల క్యూలైన్లు, బయట క్యూలైన్లు, మరియు

నూతనంగా బ్రాహ్మణ సంఘ భవనం ప్రక్కన గల శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వాముల వారి స్థలములో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్న వేదిక ఏర్పాట్లు, క్యూ లైన్ లు వాహనాల పార్కింగ్ స్థలాలను ఎస్పీ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, DSP రఘుఛందర్ , CI రాంనర్సింహ రెడ్డి , ఎస్ఐ లు ఉదయ్ కుమార్ , ఉమాసాగర్ , దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.