ధర్మపురి ఆలయంలో ఆయనే  రా రాజు చర్యలు ఉండవు !

👉 లక్షలాది రూపాయల అవినీతి వెలుగు చూసినా  అంతే మరి !


👉 ఆ రాజుకు అండదండలు ఎవరివో  ?


J.SURENDER KUMAR,


సాలిన కోట్లాది రూపాయల ఆదాయం గల ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహించే ఓ ఉద్యోగి విధి నిర్వహణలో రాజు రారాజు. ఆయన విధులు నిర్వహించే శాఖలో అవినీతి, అవకతవకలు  వెలుగు చూసినా, బదిలీ మాట దేవుడెరుగు, ఆ రాజు పై చర్యలు ఉండవు, ఆయన విధులు నిర్వహించే శాఖ నుంచి మార్పు ఉండదు.

ఆ రాజు నుంచి అధికారులు లక్షలాది రూపాయలు రికవరీ చేసి పోపు సరుకులు కొనుగోలుచేసీ రికార్డులలో నమోదు చేసినా అతనిపై క్రమశిక్షణ చర్యలు ఉండవు.  ఈ  రాజు రారాజు కు ఎవరి అండదండలు ఉన్నాయో ? తెలియదు కానీ అతనిపై అధికారులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి,  కొందరు ఉద్యోగులు, భక్తులు జంకుతున్నారు.


వివరాల్లోకి వెళ్తే..

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తజనంకు ఆలయ పక్షాన నిత్యం వందలాది మందికి ఉచిత అన్నదానం నిర్వహిస్తారు. దీంతోపాటు  శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యోగ, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఉగ్ర నరసింహా స్వామి, శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీరామలింగేశ్వర స్వామి, తిమ్మాపూర్ శ్రీ సీతారామ చంద్ర స్వామి వారలకు  సాంప్రదాయం మేరకు నివేదన, వడలు, బూరెలు నైవేద్యం తదితర ప్రసాదాలు నివేదిస్తారు. భక్తులకు స్వామివారి లడ్డు, పులిహోర, సిరా ప్రసాదాలను ఆలయ పక్షాన విక్రయిస్తుంటారు.


( దేవాదాయ శాఖ జారీచేసిన సర్కులర్ మేరకు నాణ్యత ప్రమాణాలు పాటించి వీటి తయారీలో సరుకులు వినియోగించాల్సి ఉంటుంది )


స్వామివారి నిత్యావసర సరుకుల నిల్వ గోదాం ను ( దిట్టం ) నిర్వహించే ఉద్యోగి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా సరుకులు వినియోగించి,  ప్రతి నెల లక్షలాది రూపాయలు విలువ చేసి అదనపు సరుకులను బయట మార్కెట్లో అమ్ముకుంటాడు అనే ఆరోపణలు ఉన్నాయి.


👉 అవినీతి వెలుగు చూసింది ఇలా..

2023 అక్టోబర్ లో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ధర్మపురి ఆలయ కార్యాలయంలో, సరుకుల నిల్వ గోదాముల తనిఖీలలో దాదాపు నాలుగు లక్షల రూపాయలు పైగా విలువ గల సరుకులు అధికంగా ఉన్నట్టు తనిఖీ బృందం గుర్తించారు. నిత్య నివేదన రిజిస్టర్, అన్నదానం స్టాక్ రిజిస్టర్ , పులిహోర స్టాక్ రిజిస్టర్, లడ్డూ స్టాక్ రిజిస్టర్ , పూజా సమగ్రి స్టాక్ రిజిస్టర్, తదితర రిజిస్టర్లు ఇష్టానుసారంగా పర్యవేక్షించడంలో విఫలమైనట్టు తనిఖీలలో వెలుగు చూసింది .

2023 అక్టోబర్ మాసంలో డి సీ తనిఖీ చేస్తున్న దృశ్యం(ఫైల్ ఫోటో)


కొన్ని నెలలపాటు ఈ ఉద్యోగిని నిత్యవసర సరుకులు గోదాం పర్యవేక్షణ బాధ్యత నుంచి తప్పించి మరో ఉద్యోగికి బాధ్యతలు అప్పగించారు.  కొన్ని నెలలపాటు మౌనం గా ఉంటూ  అధికారులపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగిని గోదాం సరుకుల బాధ్యత నుండి  బదిలీ చేయించి ఈ ఉద్యోగి తిరిగి అక్కడే విధులు నిర్వహిస్తున్నాడు .

వివరణ కోరుతూ డి సీ జారీ చేసిన నోటీస్ (ఫైల్ కాఫీ)

👉 ప్రశ్నించిన భక్తుడి పై దాడి..

గత సంవత్సరం జూలై 19న ఓ భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి నిత్యాన్నదానంలో భోజనం చేస్తూ, అన్నం నాణ్యత ప్రమాణాలపై అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. భక్తుడికి ఉద్యోగులకు మాట మాట పెరిగి భక్తుడి పై కొందరు ఉద్యోగులు దాడి చేశారు.

ఈ అంశంపై ఉన్నత అధికారులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని సీసీ కెమెరా లోని దృశ్యాలు తొలగించడమే గాక, ఆంధ్ర ప్రాంతానికి చెందిన భక్తుడితో  భక్తుడే దురుసుగా ప్రవర్తించాడు, ఉద్యోగులది తప్పులేదు అంటూ లిఖితపూర్వకంగా  లేఖను తీసుకున్నారు.


👉 ఇండెంట్ ఎక్కువ సరుకులు తక్కువ ?

నమూనా సరుకుల ప్యాకెట్లు ఆలయంలో ఉంచాలి (అగ్రిమెంట్)


గతంలో డిప్యూటీ కమిషనర్ చేసిన తనిఖీల్లో లక్షలాది రూపాయలు విలువ చేసే అధిక సరుకులు పట్టుబడడంతో ఇక్కడ విధులు నిర్వహించే ఉద్యోగి విధి నిర్వహణ రూట్  మార్చినట్టు చర్చ.


నిబంధనల మేరకు నివేదన ప్రసాదాలు, అన్నదానంలో సరుకులు వినియోగించకుండా, ప్రతినెల సరుకుల కొనుగోలు ఇండెంట్ లో పేర్కొన్న సరుకుల కంటే  తక్కువ సరకులు ఆలయానికి చేరుతున్నట్టు ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.

( ఇండెంట్ లో పేర్కొన్న  సరుకులకు బిల్లును చెల్లించి, సరఫరా చేసిన సరుకుల బిల్లు మాత్రమే తీసుకొని అదనపు సొమ్మును ఈ ఉద్యోగికి కాంట్రాక్టర్ చెల్లిస్తాడు అనే ఆరోపణలు ఉన్నాయి )

👉 సరుకుల తనిఖీ ఎక్కడ ?

ఆలయ గోదాము కు చేరుకున్న సరుకులను, కమిటీ పర్యవేక్షించి, పరీక్షించిన తరువాత సరుకులు ఆర్డర్ చేసిన వివరాలు, క్వాంటిటీ, క్వాలిటీని పరిశీలించి ఆర్డర్ మేరకు సరుకులు ఉన్నాయా.? లేదా ?, టెండర్ లో పేర్కొన్న బ్రాండ్ సరుకులేనా ? అనేది నిర్ధారించిన పిదప వాహనం నుంచి సరుకులు అన్లోడ్ చేసి గోదాముకు తరలించాలి అనేది నిబంధన

( The committee will verify the material after verification of the material will be unloaded at devasthanam Paditharam Store. During transportation any damage towards the material will not take its to account)


ఈ నిబంధనలు ఆలయ కార్యనిర్వహణాధికారికి, దిట్టం నిర్వహించే ఉద్యోగికి తప్ప ఇతరులకు తెలియదు, పాలక మండలి లేని సందర్భంలో ఆలయ అర్చకుడు పరిశీలించి సంతకం చేయాల్సి ఉంటుంది.


👉కల్తీ నిరోధక శాఖ తనిఖీలు లేవు !


ఇది ఇలా ఉండగా ఆలయ గోదాం లో నిలువ సరుకులను, తయారీ ప్రసాదాలు, భోజన పదార్థాలను, ఫుడ్ ఇన్స్పెక్టర్ నెల రోజులకోసారి తనిఖీ చేసి నివేదికలు సంబంధిత శాఖ అధికారులకు పంపించాలి. లేదా కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా తనిఖీ చేయాల్సి ఉంటుంది.. 2017 జూలై నెలలో అప్పటి రాష్ట్ర గవర్నర్ ధర్మపురి ఆలయానికి రావడంతో ప్రోటోకాల్ నిబంధనల మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేసినట్టు రికార్డులలో నమోదయింది.


ఈ నెల 10 నుంచి  అంగరంగ వైభవంగా. 15 రోజులపాటు జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలకు రాష్ట్రం నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తజనం వస్తుంటారు. స్వామివారి లడ్డు, పులిహోర, నివేదన ఉచిత అన్నదానం లో అధికారులు  నాణ్యత ప్రమాణాలను పాటిస్తారో ?  లేదో  ? అని భక్తజనం వేచి చూస్తున్నారు.