J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆరు సంవత్సరాల తరువాత ప్రభుత్వం పాలక మండలి ఏర్పాటు చేసింది. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చొరవతో పాలకమండలి ఏర్పాటయింది.
బుధవారం దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
👉 దేవాలయ కమిటీ సభ్యులుగా ..

ఎదులపురం మహేందర్,. బాదినేని వెంకటేష్ , .బొల్లారపు పోచన్న, గుడ్ల రవీందర్, జక్కు రవీందర్, .కొమురెల్లి పవన్ కుమార్, మందుల్ల మల్లేష్ , నేదునూరి శ్రీధర్ ,.రాపర్తి సాయికిరణ్ , సంబేట తిరుపతి , స్థంబంకాడి గణేష్ కుమార్ , వొజ్జల సౌజన్య , అవ్వ సుధాకర్ లు కమిటీ సభ్యులుగా ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఈ ధర్మకర్తల మండలి సభ్యులు గురువారం ధర్మపురి ఆలయ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇది ఇలా ఉండగా..
2019 సంవత్సరం నుండి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రభుత్వం ధర్మకర్తల మండలి నోటిఫికేషన్ జారీ చేసి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దాదాపు 6 సంవత్సరాలుగా ధర్మపురి ఆలయానికి పాలకవర్గం లేదు.
👉 గత సంవత్సరం పాలకవర్గ ఏర్పాటుకు నోటిఫికేషన్ ..
రాష్ట్రంలో ప్రముఖ 26 ఆలయాలకు ప్రభుత్వం పాలకవర్గ లు ఏర్పాటు కోసం ప్రభుత్వ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారిని రామ శైలజ అయ్యంగార్, ఆగస్టు 23, 2024, న G.ORt. No 229 . పాలకవర్గ ఏర్పాటుకు జీవో జారీ చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకటి. వరంగల్ జిల్లాలో 8, నల్గొండ జిల్లాలో 8 మహబూబ్ నగర్ జిల్లాలో 4. రంగారెడ్డి జిల్లాలో 2 సికింద్రాబాద్ పరిధిలో 3 . ఆలయాల పాలకవర్గ ఏర్పాటుకు ఉత్తర్వులలో పేర్కొన్నారు. రేపొ మాపో మరో 25 ఆలయాలకు ప్రభుత్వం పాలకవర్గాలను ప్రకటించనున్నారు