ధర్మపురి , జగిత్యాలకు రానున్న బీసీ కమిషన్ !

👉 ఈనెల 27 న..

J.SURENDER KUMAR,

ఈనెల 27 న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్ మరియు రంగు బాలలక్ష్మి  ధర్మపురి, జగిత్యాల్ కు రానున్నారు.


తమ కులాల పేర్లను మార్చాలని వచ్చిన వివిధ అభ్యర్థనలు బిసి కమిషన్ పరిశీలిస్తున్న విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా ఆయా కులాల సామాజిక జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి, వారి నివాస ప్రాంతాలను బిసి కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్, సభ్యులు. స్వయంగా తెలుసుకోమన్నారు. 

ఇందులో భాగంగా 26 న  వేములవాడ మరియు సిరిసిల్లలో పర్యటించి వంశరాజ్ మరియు దొమ్మర కులస్థుల నివాస ప్రాంతాలను కమిషన్ సందర్శించి అధ్యయనం చేయనుంది. అదేవిధంగా 27 న   జగిత్యాల మరియు ధర్మపురిలలో పర్యటించి వంశరాజ్, దొమ్మర మరియు వీరభద్రీయ కులాల వారిని కమిషన్ అధ్యయనం చేయనుంది.