ధర్మపురిలో ఘనంగా ఉగ్ర నరసింహుడి డోలోత్సవం !


J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామి వారి తెప్పోత్సవ, డోలోత్సవం శనివారం ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తజనం పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక బ్రహ్మ పుష్కరిణి లో స్వామివారి ఉత్సవ మూర్తులు బల్లకట్టు హంస వాహనం పై ఉంచి. నీటిలో ఐదు ప్రదక్షిణాలు. నిర్వహించారు. వేలాది మంది భక్తజనం  ఉత్సవాన్ని కనులారా తిలకించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను మంటపంలో. డోలోత్సవం నిర్వహించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా. ఆలయ అధికారులు,. పాలకవర్గ సభ్యులు, పోలీస్ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేశారు. తాగునీటి వసతి సౌకర్యం, భక్తులకు టీటీడీలో ఉచిత అన్నదానం, ఏర్పాటు చేశారు.