J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలో అవినీతి నిరోధక ట్రాప్ లో గురువారం సాయంత్రం పట్టుబడ్డ మున్సిపల్ కమిషనర్ తో ఏసీబీ కి చిక్కిన అధికారుల సంఖ్య ఐదుకు చేరింది.
గత ఐదు సంవత్సరాల క్రితం ధర్మపురి పోలీస్ స్టేషన్ లో ఓ ఏస్ ఐ. నేరం లో ఉన్నా వాహనం రిలీజ్ కు లంచం డిమాండ్ చేయగా పెగడపల్లి మండలం కు చెందిన బాధితుడు ఏసీబీ నీ ఆశ్రయించి ట్రాప్ చేయించాడు.

1987-88 లో అటవీశాఖ సెక్షన్ అధికారి ని కమలాపూర్ కు చెందిన రాజారామ్ ట్రాప్ చేయించారు. ఈ ట్రాప్ లో ఏసీబీ అధికారులు అతి ఉత్సాహంతో అటవీ శాఖ ఉద్యోగి విధుల నిర్వహణ లో జోక్యం చేసుకున్నారు, అంటూ న్యాయస్థానం ఏసీబీ అధికారులకు మొట్టికాయ వేసింది. ఉద్యోగి సస్పెన్షన్ కాలం ( దాదాపు రెండు సంవత్సరాలు ) తో జీతం చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
ధర్మపురి పోలీస్ స్టేషన్ లోని ఎస్సై నివాసంలో వేలది రూపాయల అక్రమ టేకు కలప ఉంచారు అని పట్టణానికి చెందిన కందాల నరసింహమూర్తి హైదరాబాద్ లో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులు దాడులు చేసి ఎస్సైని సస్పెండ్ చేశారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిపాలన భవన నిర్మాణంకు రవాణా చేసిన టేకు కలపకు పర్మిట్ లు జారీ చేయలేదని. పట్టణంలోని యేల్ల గౌడ్, కలపమిల్ ను ( సామిల్ ) ను జగిత్యాల అటవీశాఖ రేంజ్ అధికారి, స్థానిక సెక్షన్ అధికారి సీజ్ చేశారు, తిరిగి అనుమతి ఇవ్వడానికి సామీల్ యజమాని ని లంచం డిమాండ్ చేశారు.
2006 -07 లో వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులను సామిల్ యజమాని ఆశ్రయించారు. ధర్మపురి అటవీశాఖ సెక్షన్ అధికారి ట్రాప్ చేయగా, రేంజ్ అధికారి ఆదేశాల మేరకు డబ్బులు తీసుకుంటున్నట్టు ఏసీబీ అధికారులకు తెలిపాడు. ధర్మపురి అధికారిని ఏసీబీ వాహనంలో జగిత్యాల రేంజ్ అధికారి కార్యాలయానికి పట్టుకెళ్ళి మాటు వేశారు. రేంజ్ అధికారికి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకొని జైలుకు తరలించారు.