ధర్మపురి నరసింహుడి ఆదాయం 1.19 కోట్లు !

👉 9 రోజులు జాతర ఆదాయం ₹ 53,48,030 /-

👉 81 రోజుల్లో హుండీ ఆదాయం ₹ 66,02,628 /-


J.SURENDER KUMAR ,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయం ₹ 1,19,50,658/- ( కోటి 19 లక్షల 50, వేల 658 రూపాయలు ) లభించాయి.

👉 ఇందులో..

శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల ఈనెల 10 నుంచి 19 వరకు ( 9 రోజులలో )  వచ్చిన ఆదాయము

👉 టికెట్ల ద్వారా ₹ 23,28,707/-


👉 ప్రసాదాల ₹ 23,92,835/-

👉 అన్నదానం ₹ 6,26,488/-

మొత్తం ఆదాయము ₹ 53,48,030/-

👉 81 రోజుల హుండీ లెక్కింపు ద్వారా ₹
66,02,628/-

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరిగింది.   గత సంవత్సరం డిసెంబర్ 30 నుంచి నేటి వరకు ( 81) రోజుల ₹ 66,02,628/- ఆదాయం వచ్చింది.  హుండీ లో మిశ్రమ బంగారం 59గ్రాములు, మిశ్రమ వెండి 8.400 కిలోలు ,
37 విదేశీ నోట్లు 37 లభించినట్టు అధికారులు తెలిపారు.


భారీ భద్రత నడుమ శుక్రవారం దేవదాయ శాఖ అధికారులు, సిబ్బంది, అర్చకులు, పాలకవర్గ సభ్యు లు స్వచ్ఛంద సంస్థలు భక్తులు హుండీ లెక్కింపు లో పాల్గొన్నారు.